09-09-2025 07:23:03 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్వో విద్య(Deputy DMHO Vidya) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది విధి నిర్వాహణ, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్యసేవలు అందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆమె వెంట వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.