calender_icon.png 25 October, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

24-10-2025 11:18:44 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శుక్రవారం  వాంకిడి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జి జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు అయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని, విద్యార్థుల గైర్హాజరకు గల కారణాలను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థినిలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ పథకం క్రింద పాఠశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు. విద్యార్థినులతో మాట్లాడుతూ పాఠశాలలు వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాభ్యాసం, మధ్యాహ్న భోజనము నాణ్యత, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాలను విద్యార్థినులు సక్రమంగా వినియోగించుకోవాలని, చదువుపై శ్రద్ధ వహించాలని తెలిపారు.