02-05-2025 12:15:39 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు, మే 1: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో క్షయ వ్యాధి పోస్టర్లను విడుదల చేసి, మాట్లాడారు. ప్రతి ప్రజాప్రతినిధి,అధికారి కూడా క్షయ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. క్షయ వ్యాధి లేని నియోజకవర్గంగా మునుగోడును నిలుపాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారి డాక్టర్ నర్మద, మంగిభాయ్, అజయ్, సైదులు, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.