21-05-2025 08:23:56 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్(Hayathnagar) వద్ద కుంట్లూరులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. నియంత్రణ లేని వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.