calender_icon.png 21 May, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం కులగణన నిర్ణయం హర్షణీయం

02-05-2025 12:14:46 AM

-తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్

-కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరాంచక్రవర్తి 

కరీంనగర్, మే 1 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జనాభా లెక్కల తో పాటు అన్న చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి తెలిపారు. రాష్ర్టంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కులగణన దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని పేర్కొన్నారు. 

దీనిని ప్రేరణగా తీసుకుని కేంద్రం కుల గణన చేపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి వల్లే కుల గణన చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ర్ట బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి శ్రీరామ్ చక్రవర్తి సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.