12-01-2026 05:17:16 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో ఉత్తమ రక్తదాతలు, ఉత్తమ రక్తదాత మోటివేటర్లకు జాతీయ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని, 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి, రక్తం అవసరమైన అనేక మంది ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన రక్తదాతలు, మోటివేటర్లను సత్కరించారు. ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రజాసేవకుడు, రక్తదాత, బ్లడ్ డోనర్ ఆర్గనైజర్, మోటివేటర్ అయిన మాడిశెట్టి ప్రశాంత్‌కు జాతీయ ఉత్తమ రక్తదాత మోటివేటర్ పురస్కారాన్ని IVF జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా అందుకున్నారు.