01-08-2025 12:03:38 AM
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పును తాము స్వాగతిస్తున్నామని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పే ర్కొన్నారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కోర్టు తీర్పుపై ఆయన స్పందిం చారు. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడం మంచి ప రిణామమన్నారు.
కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా తె లంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కో రారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ గతంలో బీఆర్‌ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్ర భుత్వం ఎమ్మెల్యేలను లాక్కొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందన్నారు. తెలంగా ణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “జనహిత పాదయాత్ర” వాస్తవంగా జనహితమా లేదా ప్రజలను మోసం చేయడమా అనేది కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్.. విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి వర్గాలకు డిక్లరేషన్ల పేరుతో అనే క హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, మేనిఫెస్టోలో పేర్కొ న్న అంశాలు, డిక్లరేషన్ల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.