01-08-2025 12:03:55 AM
బాన్సువాడ జూలై 31 (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుం బీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. బిచ్కుంద.మండల శాంతాపూర్.
గ్రామానికి చెందిన భాను ప్రసాద్ (16) మంగళవారం రాత్రి జ్వర రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో పరిస్థితి విషమించినప్పటికీ పట్టించుకోలేదని. ఉదయం నిజామాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారని బాధితులు తెలిపారు. దీంతో బాలుడిని వెంటనే నిజా మాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్ప టికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీక రించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడకు తీసుకెళ్లి ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. సీ అశోక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్ని బాధితులను. సముదాయించారు.