calender_icon.png 8 August, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం: మంత్రి పొంగులేటి

08-08-2025 05:16:34 PM

ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరబోతుంది అని ఉద్బోధ..

హన్మకొండ (విజయక్రాంతి): హన్మకొండ నగరంలోని బాలసముద్రం అంబేద్కర్ నగర్ లో నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy)తో కలిసి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత జీ ప్లస్ త్రీ విధానంలో 592 ఇండ్లను రూ. 3904 లక్షల వ్యయంతో రెండు పడక గదుల ఇండ్లను నిర్మించగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించి వన మహోత్సవంలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ఆ మొక్కను నాటారు. 

అనంతరం లబ్ధిదారులు మంత్రిగారికి, ఎమ్మెల్యేలకు రాఖీ పర్వదినము సందర్భంగా రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో 592 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజ్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, నగర కమిషనర్ తో కలిసి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాన్ని చేయలేని పనులను ఒక్కొక్కటిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తుంటే టిఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదని అన్నారు. అనేక పనికిమాలిన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ పెట్టుకున్నా దొంగ యూట్యూబ్ ఛానల్ ల చేత దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చడమేనని, నిరుపేదలైన పేదవారు అధైర్యపడవవద్దని ఈ ప్రక్రియ దశలవారీగా కొనసాగిస్తామని అన్నారు. సొంతింటి కలయ నెరవేరుపోతుందని ఎదురుగా ఉన్న లబ్ధిదారుల ముఖంలో సంతోషాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉన్న వాటికి మిత్తిలు వాయిదాలు చెల్లిస్తూ ఇటు "సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెడ్ల లాగా నడిపిస్తు" రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నామన్నారు. ఈరోజు  ఇండ్లు పంపిణీ చేసిన లబ్ధిదారులలో ఏ విధమైనటు వంటి పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ ఏది చూడకుండా నిష్పక్షపాతంగా నిజమైన అర్హులైన పేదవారికి కేటాయించడం జరిగిందన్నారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... లబ్ధిదారుల ముఖాల్లో సంతోషాన్ని చూస్తుంటే నాకు నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినంత ఆనందం ఉందన్నారు. ఇల్లు లేని నిరుపేద కూడా ధైర్య పడవద్దు అని దశలవారీగా ఖాళీ ప్రదేశాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో దశలవారీగా ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. అభివృద్ధి చేతగాని గత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక పనికిమాలిన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతోందన్నారు. తాము పార్టీలను చూడకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చాలా నిష్పక్షపాతంగా కేటాయించామని అన్నారు. 

అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్ లో ఉన్నటువంటి లబ్ధిదారులు త్వరలో మీకు కేటాయించిన రెండు గదుల ఇండ్లలోకి మారాలని కోరారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తా ఇందిరమ్మ రాజ్యంలో 'రోటీ కపుడా ఔర్ మకాన్' అనే నినాదంతో పేద ప్రజలందరికీ గూడు, నీడ కల్పించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేర బోతుంది. గత ప్రభుత్వం పదేళ్ల పాలన పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చలేక పోయారు. పదేండ్ల లో చెయ్యని పనులను 18 నెలల్లో చేస్తుంటే ఓర్వలేక  పింకు గొర్రెలు విమర్శలు చేస్తున్నారన్నారు. పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అందజేస్తూ నాయకులను కాకుండా సేవకులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకుని దాచుకున్నారనీ నాగరాజు  ఆరోపించారు. ఈ కాళోజి కళాక్షేత్రం పనులను పదేళ్ల అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. 

తర్వలోనే వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పైడిపల్లిలో వికలాంగుల కోసం నిర్మాణం చేసిన రెండు పడకల గదులను లబ్ధిదారులకు మంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు. దేశంలో ఏక కాలంలో 21 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహిస్తూ క్వింటాకు 500 బోనస్, రైతు భరోసా, మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా కొనసాగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, జిల్లా గ్రంధాలయాలు చైర్మన్ అజీజ్ ఖాన్, వరంగల్ ,హన్మకొండ జిల్లా ల కలెక్టర్లు, సత్య శారద, స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్ పేయ్, ఉన్నతాధికారాలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.