calender_icon.png 8 August, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13వ వార్డు పారిశుద్ధ్య రహిత వార్డుగా తీర్చిదిద్దుతా

08-08-2025 05:21:06 PM

మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీనీ పారిశుధ్య రహిత వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్(Former Councilor Body Srinivas) తెలిపారు. శుక్రవారం టీచర్స్ కాలనీలో ఇంటి పరిసరాల ప్రాంతాలతో పాటు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తాచెదారం, పారిశుద్ధాన్ని మున్సిపల్ కార్మికుల చేత తొలగించడం జరిగిందన్నారు. వర్షాకాలం దృష్ట్యా కాలనీ వాసులకు ఎలాంటి దోమల వ్యాప్తి చెందకుండా శుభ్రపరిచి, దోమల పిచికారి మందు చేయించి కాలనీలో ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నామని ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం కాలనీలో పర్యటిస్తున్నామని పరిశుభ్రతపై కాలనీవాసులకు అవగాహన కల్పించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవాలని అన్నారు. ఇలాంటి మురికి నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. కాలనీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని కాలనీవాసులు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు.