calender_icon.png 8 August, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడ పిల్లలకు రక్షణగా ఉంటాం: ఎస్ఐ నాగరాజు

08-08-2025 05:02:13 PM

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్..

నకిరేకల్ (విజయక్రాంతి): విద్యార్థినిలపై ఈవిటీజింగ్, ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని విద్యార్థులు స్నేహభావంతో ముందుకుపోవాలని రామన్నపేట ఎస్ఐ నాగరాజు(SI Nagaraju) పిలుపునిచ్చారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థినీలతో స్థానిక ఎస్సై పోలీస్ స్టేషన్ సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లలకు రక్షణగా పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా ముందు ఉంటుందని విద్యార్థి నీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈవిటీజింగ్ ర్యాగింగ్ కు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆడపిల్లలు ధైర్యంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆయన  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు చానకొండ రామచంద్రం, అక్షిత, అలేఖ్య, ధరావత్ సంతోష నాయక్, దివ్య, పూజిత,మమత తదితరులు పాల్గొన్నారు.