calender_icon.png 14 August, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాల్లో కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం

14-08-2025 01:59:09 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి) : స్థానిక ప్రజల కోరిక మేరకు కాలనీ, బస్తీలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో కమ్యూనిటి హాల్ ను కట్టిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. బుధవారం భోలక్‌పూర్ డివిజన్ రంగానగర్ సెకండ్ వెంచర్‌లో జీహెచ్‌ఎంసీ డీఈ సన్నీతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక మహిళ లు, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు వినతి పత్రం అందజేశారు. స్థానికంగా 400 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని. శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకునేం దుకు స్థలం లేక రోడ్లపైనే నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యా దు చేశారు.

స్థానికంగా ఉన్న ఖాళీస్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టించాలని విజ్ఞప్తి చేశా రు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపా ల్ మాట్లాడుతూ  గతంలో రంగానగర్ సెకం డ్ వెంచర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ శిథిలావస్తకు చేరుకుని వర్షాల వల్ల కూలిపోయిం దని పేర్కొన్నారు. ఇదే స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి స్థానిక ప్రజల కోరికను నెరవేర్చే విధంగా పనిచేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను వై. శ్రీనివాస్ రావు  శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బింగి నవీన్, నాయకులు రహీం, రంగానగర్ బస్తీ ప్రధాన కార్యదర్శి వినోద్, నాయకులు మల్లేష్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.