calender_icon.png 15 August, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న ఫోన్ గంటలోపే అప్పగింత

14-08-2025 10:10:04 PM

మరిపెడ/మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ బస్టాండులో బురహంపురం గ్రామానికి చెందిన తాటికొండ మంజుల సెల్ఫోన్, పదివేల నగదు, బ్యాంకు క్రెడిట్ కార్డు, ఇతర విలువైన వస్తువులు ఉన్న బ్యాగును పోగొట్టుకుంది. ఈ విషయాన్ని మరిపెడ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసిన గంటలోపే ఎస్ఐ సతీష్(SI Sathish) లొకేషన్ ట్రేస్ అవుట్ ద్వారా పట్టుకొని బాధిత మహిళకు అందజేశారు. నగదుతో పాటు సెల్ ఫోన్, విలువైన బ్యాంకు క్రెడిట్ కార్డులను తిరిగి అప్పగించినందుకు బాధిత మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.