calender_icon.png 31 October, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

31-10-2025 12:00:00 AM

 కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో రైతులకి ఇబ్బందులు కలగకుండా  ధాన్యం కొనుగోలు జరగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం బీబీనగర్ మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇప్పటి వరకు ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయని. ఇంకా పంట మీద ఎంత ధాన్యం ఉందని రైతులను అడిగి తెలుసుకున్నారు.వర్షాల కారణంగా ఏమైనా తడిసిందా. తడవకుండా టార్పాలిన్ లు కప్పుకోవాలని అని సూచించారు . పంట మీద ఉన్న వరి కూడా కొంచెం ఆరిన తరువాత కోత కోయాలని అని సూచించారు.

కేంద్రంలో ఉన్న ధాన్యంను ఎంత మేరకు తేమ శాతం ఉందని పరిశీలించారు.   తేమ శాతం వచ్చిన ధాన్యం ఎప్పటికపుడు కొనుగోలు చేసి లారీలకు లోడ్ చేసి మిల్లులకు తరలించాలి అని అన్నారు ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట నష్టం కాకుండా... అధికారులు బాధ్యతాయుతంగా ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. ట్రాక్ షీట్ అప్డేషన్ ఎప్పటికప్పుడు జరగాలని,ప్రతి కేంద్రంలో కనీస మౌలిక వసతులు ఉండాలన్నారు.జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన అన్ని ధాన్యం కేంద్రాలలో... కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అన్నారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వరద ఉధృతి తగ్గేంతవరకు వాగులు దాటవద్దు

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలు వాగులు దాటకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసి వరద ఉద్ధృతిని జిల్లా కలెక్టర్  పరిశీలించారు. జిల్లాలో రుద్రవెల్లి, సంగెం వద్ద రెండురోజులుగా ఎడతెరపి లేకుండా  కురిసిన వర్షాలకు మూసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.  వరద ఉధృతికి  రుద్రవెల్లి జూలూరు, బొల్లేపల్లి-సంగెం గ్రామాల మద్య  వరద ఉద్ధృతి తగ్గే వరకు  రాకపోకలు బంద్ చేయడం జరిగిందని తెలిపారు .

ప్రయాణికులు, వాహనదారులు ఎవరు కూడా వరద ప్రవాహంలో నుండి దాటడానికి సాహ సం చేసి ప్రాణాల ముప్పు  తెచ్చుకోవద్దని తెలిపారు. ప్రజలు ఫోటోలు దిగడానికి కానీ, చేపలు పట్టడానికి కానీ వెళ్ళవద్దని తెలిపారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య సిబ్బం ది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించడం  జరుగుతుందన్నారు. ప్రజలు వర్షాలు తగ్గిన తర్వాత కాచి వడపోసి చేర్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. దాని వలన వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. వర్షపు నీరు నిలిచిన చోట ఆయిల్ బల్స్ వెయ్యాలని సంబంధిత అధికారులకు తెలిపారు.