24 April, 2026 | 3:05 AM

శంకుస్థాపన చేసిన ప్రతి పనినీ పూర్తి చేస్తాం

24-04-2026 01:33 AM

ఉప్పల్ ఏప్రిల్ 23విజయక్రాంతి : నాచారం డివిజన్లోని  శంకుస్థాపరులు చేసిన ప్రతి ఒక్క పనిని ఒక్కొక్కటిగా త్వరలో పూర్తి చేస్తామని  బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ అన్నారు. రాఘవేంద్ర నగర్ పోచమ్మ గుడి నుండి అన్నపూర్ణ కాలనీకి వెళ్లే  దారిలో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కార్పొరేటర్ పదవి కాలం చివరలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  ప్రత్యేక చొరవతో  అభివృద్ధి పనులకు  నిధులు మంజూ రు అయ్యాయని  శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క పనిని పూర్తి చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీ నాయకులు అభివృద్ధి పనుల శాంక్షన్ పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని  దీని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు  విట్టల్ యాదవ్ మారయ్య రాజబాబు దేవులపల్లి యాదగిరి నరేందర్ గౌడ్ మన్సూర్  రాజు తదితరులు పాల్గొన్నారు.