calender_icon.png 12 January, 2026 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తాం

12-01-2026 02:54:36 AM

  1. ఆధునిక పరిజ్ఞానంతో యుద్ధ ప్రాతిపదికన తవ్వకాలు
  2. సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాల పను లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎస్‌ఎల్ బీసీ టన్నెల్ పనుల పురోగతిపై ఆదివారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, లెఫ్టినెంట్ జనరల్ హర్‌పాల్ సింగ్, ఇంజనీర్లతో మంత్రి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సొరం గం తవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు.

తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నామని వెల్లడించారు. మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే పూర్తయినట్టు అధికారులు మంత్రికి వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్ట్ సిస్టం కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తిచేయడా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి ఉత్తమ్ వివరించారు. సొరంగ మార్గం పనుల్లో క్షేత్ర స్థాయి లో పని చేసే సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఉంటాయని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన వల్లే ఎస్‌ఎల్బీసీ పనుల్లో ఆలస్యం జరిగిందన్న మంత్రి.. ప్రాజెక్టు పూర్తి చేసి నల్లగొండను సస్యశ్యామలం చేస్తామని, ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా నిర్మూలిస్తామని ప్రకటించారు.