10-12-2025 12:25:37 AM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మర్రిగూడ, డిసెంబర్ 9 (విజయక్రాంతి ): కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మీదని, గ్రామపంచాయతీల అభివృద్ధి పరిచే బాధ్యత మాదని మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మర్రిగూడ మండలంలోని ఎరుగండ్లపల్లి ,మర్రిగూడ, తమ్మడపల్లి, కొండూరు, రాజపేట తండా, వట్టిపెల్లి గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
అనంతరం ఎరుగండ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పులిమామిడి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడా రు. మునుగోడు, నియోజకవర్గంలోనీ చర్లగూడ, లక్ష్మణపురం, ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎర్రగండ్లపల్లి గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను సర్పంచ్ గెలిచిన అనంతరం పులిమా మిడి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తాను ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఏరుగండ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పులిమామిడి నరసింహారెడ్డి గత రెండేళ్లుగా గ్రామంలో సి.సి కెమెరాలు ఏర్పాటు, త్రాగునీటి బోర్లు వేయించడం, ప్రతి గల్లీలో సిసి రోడ్లను వేయించడం, అంతేకాకుండా, మరింత అభివృద్ధిపరిచేందుకు మీ ముందుకు ఓ ప్రజా ప్రతినిధిగా ఎన్నిక అయ్యేందుకు వస్తున్నందున గ్రామ సర్పంచిగా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వ పథకాలైన పెన్షన్లు, ఇంద్రమ్మఇండ్లనునిర్మాణాలను గ్రామంలో ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్య తీసుకుంటానని ఆయన బహిరంగ సభలో హామీ ఇచ్చారు.
ముందుగా కళాకారులు కార్యకర్తలు నాయకులతో ఎరుగండ్లపల్లి బస్టాండ్ నుండి గ్రామపంచాయతీ వరకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాసులు, వెన్నమనేని రవీందర్ రావు, మాజీ ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, మహిళలు, భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.