calender_icon.png 30 July, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ ఎస్టేట్‌ను మరింత విస్తరిస్తాం

30-07-2025 12:21:41 AM

  1. క్రెడాయ్ నూతన చైర్మన్‌గా ప్రేమ్‌సాగర్‌రెడ్డి
  2. క్రెడాయ్ కొత్త కార్యవర్గం ఎన్నిక
  3. కొత్త అధ్యక్షుడిగా కె.ఇంద్రసేనారెడ్డి

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని క్రెడాయ్ నూతన చైర్మన్ ప్రేమ్‌సాగర్‌రె డ్డి తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేడ్ డెవలపర్స్ అసోసియేష్ ఆఫ్ ఇండి యా (క్రెడాయ్) తెలంగాణ యూనిట్ కొత్త కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండేళ్లపాటు పదవిలో ఉండనుం ది.

చైర్మన్‌గా ప్రేమ్‌సాగర్‌రెడ్డి, అధ్యక్షుడిగా కె ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎస్ రాంరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం శ్రీనాథ్, గోవర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సం యుక్త కార్యదర్శిగా పల్లెర్ల నాగప్రసాద్, కార్యదర్శిగా  జి. అజయ్ కుమార్, కోశాధికారిగా జగన్‌మోహన్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భం గా ప్రేమ్‌సాగర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్ వంటి నూతన ప్రాజెక్టులతో హైదరాబా ద్‌తో పాటు సమీప జిల్లాల్లోనూ ఊహించని అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీ య, తృతీయ శ్రేణి నగరాల్లోనూ అభివృద్ధికి క్రెడాయ్ దృష్టి సారిస్తుందన్నారు. 

రాబోయే దశాబ్దం తెలంగాణ రియల్ రంగానిదే: క్రెడాయ్ నూతన అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి

తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు రాబోయే దశాబ్ద కాలం ఎంతో గొప్పగా ఉండబోతోందని క్రెడాయ్ నూతన అధ్యక్షుడు కె ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 50 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఇందుకు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని జత చేస్తామని భరోసా వ్యక్తం చేశారు.

దేశంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ఆమోదానికి సగటున 4 నుంచి 5 ఏళ్లు పడుతోందని, దీనిని గణనీయంగా తగ్గిస్తే ఈ రంగానికి మరింత ఊపు వస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తారని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. డెవలపర్‌లను తదుపరి స్థాయి సాంకేతికతలు, ఆధునిక పద్ధతులతో సన్నద్ధం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. “బిల్డ్ నౌ, అప్రూవ్ లేటర్‌” వంటి కార్యక్రమాలు ఇప్పటికే మార్గం సుగమం చేస్తున్నాయని ఆయన ప్రస్తావించారు.

పట్టణాల్లోనూ రియల్ రంగాన్ని విస్తరిస్తాం: ప్రెసిడెంట్ ఎస్.రాంరెడ్డి

పట్టణాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగాన్ని విస్తరించేందుకు క్రెడాయ్ ప్రయత్నిస్తోందని నూతన ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎస్. రాంరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు భారీగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ర్టవ్యాప్తంగా ఉన్న పట్టణాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, నాణ్యమైన ఉపాధి, వృద్ధికి కేంద్రాలుగా ఎదగాలంటే రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని అన్నారు.   మెట్రోయేతర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇది  అన్ని ప్రాంతాల్లో వృద్ధిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

అవకాశాలు లభించేలా చూస్తాం: క్రెడాయ్  కార్యదర్శి అజయ్ కుమార్

క్రెడాయ్ కార్యదర్శి  జి. అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి డెవలపర్‌కు ఒకే విధమై న స్పష్టత, వనరులు, అవకాశాలు లభించేలా చూసుకోవడమే తమ లక్ష్యమన్నారు. క్రెడాయ్ చాప్టర్స్ మధ్య సమన్వయాన్ని బ లోపేతం చేయడం, సభ్యులకు మద్దతు ఇవ్వ డం, విధానపరమైన నవీకరణలు, నియంత్రణ మార్పులపై సకాలంలో సమాచారం అందించడం తమ దృష్టి అని అన్నారు. 

నిధులు సమకూర్చడమే లక్ష్యం: క్రెడాయ్ కోశాధికారి జగన్ మోహన్

క్రెడాయ్ తెలంగాణ కోశాధికారి జగన్ మోహన్ మాట్లాడుతూ బలమైన ఆర్థిక పాలన దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని, డెవలపరు, కమ్యూనిటీల కార్యక్రమాలకు నిధులు సమకూర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  క్రెడాయ్ తెలంగాణ అన్ని అధ్యాయాలలో ఆర్థిక పారదర్శకత, వనరుల నిర్వహణను నిర్ధారించడం తమ లక్ష్యమని తెలిపారు.