calender_icon.png 14 July, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం

14-07-2025 01:03:48 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల,జూలై 13(విజయ క్రాంతి): ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో చిట్యాల మండలంలోని తిరుమలపూర్ గ్రామానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను మొదలుపెట్టాలని సూచించారు. నిబంధనల మేరకు క్రమక్రమంగా బిల్లులు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గజ్జి రవి, ప్రధాన కార్యదర్శి గోలకొండ మహేష్,ఎలగొండ చిరంజీవి, నాయకులు కొత్తపల్లి రాము, గోపగాని చిన్న వెంకటేశ్వర్లు, బాలుగ నీలేష్, జన్నై ఓదెలు, కొర్రి అశోక్, గద్దల భద్రయ్య, తిరుపతి, రాజు, సాంబయ్య, రాజేశ్వరి, రజిత తదితరులు పాల్గొన్నారు.