25-09-2025 12:00:00 AM
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): మిషన్ భగీరథ గ్రిడ్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ హెచ్చరించారు.
బుధవారం కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీ నుండి కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు కార్మికులను పర్మ నెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేడు కార్మికుల హక్కులను విస్మరిస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్ర మంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ చాపిడి బాలేష్, కో కన్వీనర్ షేక్ షకీర్, జంషాద్, కార్మికులు రఫిక్, భగవత్, పురుషోత్తం, రవీందర్ కుమార్, సోహైల్, వెంకటేష్, తాజ్, లక్ష్మణ్, శివ పాల్గొన్నారు.