25-09-2025 12:00:00 AM
- అనుమతులు ఒకటి..కట్టేది కమర్షియల్ భవనం
- సెల్లార్తో పాటు నాలుగంతస్తుల నిర్మాణం
- నోటీసులతో సరిపెడుతున్న మున్సిపల్ అధికారులు
- షరా మామూలే అంటూ అక్రమార్కుల చర్యలు
పటాన్చెరు(సంగారెడ్డి), సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో అక్రమార్కు ల ఆగడాలకు అంతేలేకుండా పోతుంది. గ్రా పంచాయతీగా ఉన్న ఇంద్రేశం ఇటీవలే ము న్సిపల్గా మారింది. అయితే చాలా వరకు గ్రా మ పంచాయతీ అనుమతులతోనే భవనాల నిర్మాణాలు చేపట్టారు. పంచాయతీగా ఉన్న సమయంలో జీ ప్లస్ టూ అనుమతి మా త్రమే ఉంది. కానీ ఇక్కడ పనిచేసిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో అ నుమతులకు మించి అంతస్తులను నిర్మించ డం జరిగింది. ఈ విషయంలో అప్పటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మున్సిపల్గా ఇంద్రేశం రూపాంతం చెందినప్పటికీ సంబంధిత అధికారులు అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అనుమతి గృహానికి..కట్టేది కమర్షియల్..
ఇంద్రేశం ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు కేవలం జీ ప్లస్ టూ విధానంలో కట్టేందుకు మాత్రమే అనుమతి ఉంది. అయినా అక్రమార్కులు యథే చ్ఛగా అందరూ చూస్తుండగానే ప్రధాన ర హదారిపై కమర్షియల్ భవనం నిర్మిస్తున్నా రు. కమర్షియల్ భవనం నిర్మించాలంటే అందుకు తగిన శాఖ నుండి అనుమతులు పొందాలి. అంతేగాకుండా సెల్లార్ నిర్మించవద్దని నిబంధనలు ఉన్నా ఇష్టారీతిగా సెల్లా ర్ నిర్మిస్తూ అనుమతులు లేకుండానే నాలు గు అంతస్తుల భవనం దర్జాగా కడుతున్నా రు. ఇదంతా మున్సిపల్ అధికారులకు తెలిసినా ఫిర్యాదు చేసేంత వరకు చర్యలకు పూ నుకోక పోవడం విడ్డూరం. అంతేగాకుండా గ్రామ పంచాయతీ అనుమతితో భవన ని ర్మాణం చేపట్టి దానిని కమర్షియల్ గా మా ర్చి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీకి కమిషనర్గా మధుసూదన్రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శ లు వినిపిస్తున్నాయి.
ఉదయం నోటీసు..సాయంత్రానికి మళ్ళీ పనులు..
ఇంద్రేశం ప్రధాన రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగు అంతస్తులతో పాటు సెల్లార్ను నిర్మిస్తున్న భవనం వి షయంలో అందిన ఫిర్యాదు మేరకు ఉద యం మున్సిపల్ అధికారులు వెళ్ళి నోటీసులు జారీ చేశారు. వారు అలా వెళ్ళారో లేదో తిరిగి సాయంత్రం మళ్ళీ పనులు ప్రా రంభించారు. ఇదేంటని ప్రశ్నిస్తే షరా మా మూలే అన్నట్లుగా అక్రమార్కులు ప్రవర్తించడం వెనుక ఎవరి ప్రవేయం ఉందని ప్రజ లు ప్రశ్నిస్తున్నారు.
నోటీసులు ఇచ్చాం..ఏమి చేయమంటారు ?
ఇంద్రేశం ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న అక్రమ కట్టడంపై విజయక్రాంతి టౌన్ ప్లానింగ్ అధికారి కౌశిక్ను వివరణ కోరగా నోటీసులు ఇచ్చామని తాపీగా సమాధానమిచ్చారు. పనులు మళ్ళీ చేస్తున్నారని ప్రశ్ని స్తే ఏం చేయమంటారు..మళ్లీ నోటీసులు ఇస్తామంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇంద్రేశంలో జరుగుతున్న అక్రమ క ట్టడాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరు తున్నారు.