calender_icon.png 21 July, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి నిరుపేద సొంత ఇంటి కల సాకారం చేస్తాం

19-07-2025 01:29:49 AM

మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల అర్బన్, జూలై 18 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని ప్రతి నిరుపేద సొంతింటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారంజగిత్యాల పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ది దారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించగా ఈ సమావేశానికి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేయాలనే సంకల్పంతో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని,లబ్ధదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టామని అన్నారు.అర్హత ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానీ వారూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్ లో తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కో నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందన్నారు.ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తోందని అన్నారు.ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హతకు అనుగుణంగా ఇల్లు పారదర్శకంగా మంజూరు చేశామన్నారు.ఇళ్ల మంజూరు ప్రతిపాదన ఎవరు చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లు మంజూరు చేస్తుందని అన్నారు.గత ప్రభుత్వం కేవలం మాటలతో కాలం వెలిబుచ్చిందని జీవన్ రెడ్డి అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏ కార్యక్రమం చేపట్టినా అర్హత ప్రాతిపదికన అమలు చేశారని గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి పాలన లో కూడా అన్ని సంక్షేమ పథకాలను అర్హతకు అనుగుణంగా సంపూర్ణంగా అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు.సంక్షేమ పథకాలకు ఆధారమైన రేషన్ కార్డుఅర్హత ప్రతిపాదికన రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తున్నామన్నారు.విద్యా, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సేవలు పొందేలా కొత్తగా రేషన్ కార్డు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చొరవతీసుకోవాలి.