calender_icon.png 21 July, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరుకాపులు రాజకీయంగా ఎదగాలి

19-07-2025 01:28:24 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 

కరీంనగర్ క్రైం, జూలై18(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో సంఖ్యాపరంగా మున్నూరు కాపు జనాబా లెక్కలలో స్పష్టత లేదని, అన్ని రంగాల్లోనూ మున్నూరు కాపు కులస్తులు వెనుకబడిపోయారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో శుక్రవారం మున్నూరు కాపు జిల్లా కమిటి ఆద్వర్యంలో గ్రామ, పట్టణ అధ్యక్షుల విసృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ గ్రామాల వారిగా మున్నూరు కులస్తుల లెక్కలను తామే తీసి బహిర్గతం చేస్తామన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులస్తుల మీద దాడులు జరుగుతున్నాయన్నారు. మున్నూరు కాపు ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాదింపు చర్యలతో ఎసిబి దాడులు చేపడుతున్నారన్నారు. జైల్లో పెడుతున్నారని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు కులస్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మున్పూరుకాపు కులుస్థులు రాజకీయంగా మరింత ముందుకు దూసుకుపోవాలని రాజకీయాలను ప్రక్షాళన చేసే స్థాయికి ఎదుగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లు చల్ల హరిశంకర్ ,జెన్ వెంకట్ ,బుక్క వేణుగోపాల్ జిల్లా గౌరవ అధ్యక్షులు గంగుల సుధాకర్ అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధా కిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు కర్ర రాజశేఖర్ పురుమళ్ళ శ్రీనివాస్ బొమ్మ రాత్రి రాజేశం జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ నియోజవర్గ కోఆర్డినేటర్ మడ్లపల్లి శ్రీనివాస్ గంప వెంకన్న పొనుగంటి మల్లయ్య గాజుల వెంకటేశ్వర్లు నియోజకవర్గ ఇన్చార్జులు ముప్పిడి సునీల్ సత్తినేని శ్రీనివాస్ బొల్లం లింగమూర్తి దామెరకొండ సంతోష్ బండి దీపక్ ప్రశాంత్‌పాల్గొన్నారు.