సీసీఐని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం
-సీఎంతో ఎంపీ, ఎమ్మెల్యే ల తీరు చూస్తే బీజేపీ, కాంగ్రెస్ అక్రమ సంబంధం బయటపడుతోంది
-మాజీ మంత్రి రామన్న ధ్వజం
ఆదిలాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బ్రోకరిజం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కాంగ్రెస్ విజయోత్సవ సభలను నయ వంచన సభలాంటు వ్యతిరేకిస్తుంటే అదే పార్టీకి చెందిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచేత్తడం కాంగ్రెస్, బీజేపీ ల అక్రమ సంబంధం బయట పడుతుందన్నారు.
స్వలాభం కోసం ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చిన స్థానిక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి సీసీఐ పరిశ్రమను ప్రైవేట్ పరం చేసే దిశగా ఆలోచనలు చేయ డం బయటపడిందని పేర్కొన్నారు. గురువారం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవ సభలు అంటూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత సభలను ఏర్పాటు చేస్తా ఉంటే స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే లు సభలో పాలుపంచుకుని, వారి స్వలాభం కోసం సీఎం రేవంత్ రెడ్డి నీ జోకడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
సీసీఐ పరిశ్రమ పున:ప్రారం భం దిశగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ తో కలిసి కేంద్ర మంత్రులను కలవడం జరిగిందని గుర్తు చేశారు. భూ నిర్వాసితులతో పాటు సీసీఐ సాధన సమితి కమిటీ తో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. కేంద్ర మంత్రి హెచ్.డి కుమార స్వామి సైతం పరిశ్రమ ఏర్పాటు దిశగా సానుకూలంగా స్పం దించారన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని జోకుతూ అదిలాబాద్‌కు తలమానికంగా ఉన్నటువంటి సీసీఐ పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేలా పావులు కదుపుతూన్నారని ఆరోపిం చారు.
సీసీఐ పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునేది లేదని, బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామ ని హెచ్చరించారు. సీఎం గాలిలో వచ్చి గాలి మాటలు మాట్లాడుతున్నారే తప్ప స్పష్టత లేదన్నారు. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు బిఆర్‌ఎస్ తరఫున పూర్తి మద్దతిస్తున్నామన్నారు. అలాగే యూనివర్సిటీని ఎప్పు డు మంజూరు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టారన్నారు. ఈ సమావేశంలో నాయకులు అజయ్, మెట్టు ప్రహ్లాద్, సాజితోద్దీన్, గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్, దాసరి రమేష్, శ్రీనివాస్, జంగిలి ప్రశాంత్, శ్రీనివాస్, రఘు, వేణు, దయానంద్ పాల్గొన్నారు.






