07-10-2025 01:25:28 AM
యువత పాల్గొనాలి: ఉన్నత విద్యామండలి చైర్మన్
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నైపుణ్యాలను పరీక్షించేందుకు ప్రపంచ నైపుణ్య పోటీలను వచ్చే ఏడాది చైనాలో జరగనున్నాయని, అందు లో రాష్ట్రం నుంచి యువత పాల్గొనాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని విద్యామండలి కార్యాలయంలో ఈ పోటీ వివరాలను ఇండియా స్కిల్స్ కాంపిటేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ ప్రశాంతితో కలిసి వెల్లడించారు.
వరల్డ్ స్కిల్ కాంపిటేషన్ పేరిట చైనాలోని షాంఘై నగరంలో 2026 సెప్టెంబర్‌లో జరగనున్నట్లు తెలిపారు. తొలుత జిల్లా, జోనల్ స్థాయిలో పోటీలు జరుగుతాయని, తర్వాత స్టేట్, ఆ తర్వాత రీజినల్, జోనల్ స్థాయిలో పోటీలుంటాయని, ఆ తర్వాత ఫిబ్రవరి 2026లో జాతీయస్థాయి పోటీలుంటాయ న్నారు. స్టేట్ లెవల్ పోటీలను ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో నిర్వహిస్తామన్నారు.
జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారిని వరల్డ్ స్కిల్ కాంపింటేషన్‌కు అర్హత సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, అడిటివ్ మ్యాన్యుఫ్రాక్చరింగ్, ఐటీ నెట్‌వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్టానిక్స్, బ్రిక్ లేయింగ్ వంటి మొత్తం 63 స్కిల్‌కు సంబంధించి పోటీలుంటాయని, ఆశావాలు స్కిల్ ఇండియా డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైఎస్ చైర్మన్ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.