calender_icon.png 10 October, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్ట్ మెట్రిక్ వసతి గృహ విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం

10-10-2025 12:12:34 AM

భద్రాచలం, అక్టోబర్ 9, (విజయక్రాంతి):గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ డిడి అశోక్ తెలిపారు . గురువారం భద్రాచలంలోని పోస్టుమట్రిక్ వసతి గృహంలో జిల్లాలోని 23 హాస్టల్ కు వంట పాత్రలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సమయానుకూలంగా వంట చేసి పెట్టడానికి వంట సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందన్నారు.  హాస్టల్లో చదువుతున్న 3023 మంది విద్యార్థులకు వంటకు సంబంధించిన సామాగ్రితో పాటుప్లేటు, గ్లాసు, స్నాక్స్ తినే బౌల్ ఒక్కొక్క విద్యార్థికి అందజేశారు.

పీఎంహెచ్ వసతి గృహాలలో వంటలు చేయడానికి ఐరన్ గ్యాస్ పోయి 16 కేజీల పప్పు తయారుచేసే ప్రెషర్ కుక్కర్ సంబంధిత పీఎంహెచ్ వార్డెన్లకు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏటీడీవో భారతీదేవి, వార్డెన్లు మరియు డిడి ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం సిబ్బంది వెంకటరమణ, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.