calender_icon.png 10 October, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ఎండ కట్టండి

10-10-2025 12:11:49 AM

నిర్మల్, అక్టోబర్ 9 (విజయక్రాం తి): రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారులు ఉన్న బిజెపి పార్టీ ప్రజలను మోసం చేసి పరిపాలన చేస్తున్నాయని బీఆర్‌ఎస్ జిల్లా సమన్వయకర్త రామ్‌కిషన్‌రెడ్డి గజమెత్తారు.

గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ బాకీ కార్డులను కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే దేశంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ప్రవేటీకరణ పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డాక్టర్ సుభాష్ రావు పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము పార్టీ నేతలు పాల్గొన్నారు.