calender_icon.png 30 September, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణు ఆయుధాలు లేని ప్రపంచం కోసం గర్జిస్తాం

30-09-2025 02:19:56 AM

ఐడీపీడీ జాతీయ నాయకుడు డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): అణు ఆయుధాలు లేని ప్రపంచం కోసం గర్జిస్తామని ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ (ఐడిపిడి) జాతీయ నాయకులు, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు.

అక్టోబర్ 2వ తేదీ నుండి 4వ తేదీవరకు జపాన్ దేశం, నాగసాకిలో 3 రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ ఫిజీషియన్స్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ వార్ 24వ ప్రపంచ కాంగ్రెస్ లో పాల్గొనడానికి తెలంగాణకు చెందిన వైద్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్, డాక్టర్ కూనంనేని రజిని తోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్యులు డా. సమతా, డా. మాధవి తదితరులతో పాటు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ ఢిల్లీ విమానాశ్రయం నుండి జపాన్‌లోని నాగసాకికు సోమవారం ప్రయాణమైయ్యారు. వీరికి సిపిఐ జాతీయ కార్యదర్శి అమర్ జీత్ కౌర్ వీడుకోలు పలికారు.

ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫిజీషియన్స్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ వార్  అనేది 80 దేశాలలోని జాతీయ వైద్య సమూహాల నిష్పక్షపాత సమాఖ్య అని, అణ్వాయుధాల నిర్మూలనకు అంకితమైన సేవలందిస్తుందని తెలిపారు. అణ్వాయుధాల నిర్మూలన అత్యవసర వైద్య, మానవ తా,  ప్రజారోగ్య ఆవశ్యకత వంటి అంశాలపై ఈ కాంగ్రెస్ లో చేర్చిస్తామని, అణు వినాశన ముప్పు అంతం చేసి మరింత శాంతి యుతమైన, సురక్షితమైన ప్రపంచాన్ని సృ ష్టించే దిశగా నిర్ణయాలు తీసుకుంటామని డాక్టర్ దిడ్డి సుధాకర్ వెల్లడించారు.