calender_icon.png 30 September, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవతా విలువలు కలిగిన సినిమాను ఆదరించండి

30-09-2025 02:18:16 AM

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్

ఖైరతాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ప్రేమ, త్యాగం, క్షమ వంటి మానవ విలువలను ఆవిష్కరించే ది ఫేస్ ఆఫ్ ది ఫేస్ లెస్ సినిమాను కులమతాలకతీతంగా అన్ని వర్గాలవారు ఆదరించాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సిఇఒ డా. ఐ. లౌర్దురాజ్ ఎస్‌జె కోరారు.

సోమవారం  సోమా జిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ ప్రోగ్రాం డైరెక్టర్ ఎఫ్‌ఆర్.అనకర్ల ప్రశాంత్, సినిమా డిస్ట్రిబ్యూటర్ క్రిష్ణ మో హన్ లతో కలిసి  సినిమాకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..2024లో ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు అర్హత పొం దిందని, ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో 123 అవార్డులు గెలుచుకొన్నదని తెలిపారు.

నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లోని 50 థియేటర్లలో ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్ లెస్ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. మధ్య ప్రదేశ్ లోని  ఇం డోర్ పరిధి గ్రామస్థులు ’క్వీన్ ఆఫ్ ఇండోర్’ అని పిలువబడే సామాజిక కార్యకర్త సిస్టర్ రాణి మారియా నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారన్నారు. గిరిజనులు, బడు గు, బలహీనవర్గాల హక్కుల కోసం సిస్టర్ రాణి చేసిన త్యాగపూరిత పోరాటం ఈ సినిమాలో ప్రతిబింబిస్తున్నదని వివరించారు.

ముందుగా, హిందీలో రూపొందించిన ఈ చిత్రాన్ని మలయాళం, ఇప్పుడు తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేశారని తెలిపారు. దివ్యవాణి ఫోషల్ కమ్యూనికేషన్స్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రానికి డా.షైనన్ పి.ఔషెప్ దర్శకత్వం వహించగా, డా.సండ్ర రణ డి సౌజ నిర్మాతగా వ్యవహరించారని వివరించారు. ప్రేమ, క్షమాపణకు అర్థం అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారని తెలిపారు.