04-05-2025 01:17:08 AM
-పహల్గాం దాడిపై మోదీ కీలక వ్యాఖ్యలు
-ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటాం
-అంగోలా అధ్యక్షుడితో ప్రధాని భేటీ
-ఇరు దేశాల మధ్య 40 ఏళ్ల ధృడమైన బంధం
న్యూఢిల్లీ, మే 3: ఉగ్రవాదులను, వారిని పెంచి పోషిస్తోన్న మద్దతుదారుల అంతు చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హె చ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదం అనేది మానవాళికి అతిపెద్ద వినాశకారి అని వ్యా ఖ్యానించారు. శనివారం అంగోలా అధ్యక్షుడు జావో మాన్యుయెల్ గొన్కాల్వ్స్ లౌరె న్కోతో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకు ప్రమాదకరమైదని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసు కునేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా సీమాంతర ఉగ్రవాదంపై భార త్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలకడంపై ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దాదాపు రెం డు దేశాలు 40 ఏళ్లుగా ధృడమైన భాగస్వామ్యంతో ముందుకు నడుస్తున్నాయన్నారు. అంగోలా స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు.. భారత్ వారికి స్నేహం, నమ్మకం పేరుతో అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఆఫ్రికన్ దేశాల నుంచి తమకు గత పదేళ్లుగా ఎంతో సహకారం అందుతుందని, వ్యాపా రం వంద బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. ఎనిమిది దేశాల్లో ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లను తెరిచామని, మరో ఐదు దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ పనులకు సహకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆఫ్రికా లో 17 కొత్త ఎంబసీలను తెరిచినట్టు ప్రధాని మోదీ తెలిపారు.
ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం
పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీ య దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తమ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగం గా 2023 లో రాజౌరీలో ఉగ్రదాడికి పాల్పడిని ఇద్దరు ముష్కరులను జమ్మూ జైలులో ప్రశ్నిస్తూ సమాచారం సేకరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పహ ల్గాం ఉగ్రవాదులతో వీరికి సంబంధాలు ఉన్నాయా అన్న కోణం లో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.
కాగా ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరించే పని లో ఉన్నారు. దాడి సమయంలో ఘటనా స్థలిలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. టూరిస్ట్ గైడ్‌లు, పర్యాటకులు తీసుకున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 2500 మందిని ప్రశ్నించామని, వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఆత్మాహుతి బాంబుతో పాక్‌కు వెళ్తా: కర్ణాటక మంత్రి
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఆత్మాహుతి బాంబుతో పాకిస్థాన్‌కు వెళ్లి యుద్ధం చేసేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే అని పేర్కొన్న జమీర్ ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అంగీకరిస్తే పాక్‌పై యుద్ధాన్ని ప్రారంభించేందుకు ముందు వరుసలో ఉంటానని స్పష్టం చేశారు. ఇది చాలా హేయమైన చర్య అని, ఉగ్రవాదంపై పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలని జమీర్ పిలుపునిచ్చారు.