calender_icon.png 17 July, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో వీహబ్ ఏర్పాటు చేస్తాం

17-07-2025 01:15:02 AM

- మంత్రి శ్రీధర్‌బాబు

- మహిళలు వ్యాపారులుగా ఎదగాలి

- మరో 10 మందికి ఉపాధి కల్పించాలి

- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

- బ్యాంకులు క్యూ కట్టి రుణాలిస్తున్నాయి: మంత్రి సీతక్క

- పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు

పెద్దపల్లి, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణ మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి, మరరో పది మందికి ఉపాధి కల్పించాలని ఉమ్మ డి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెద్దపల్లిలో నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలను బుధవారం మంత్రి తుమ్మలతోపాటు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మహి ళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గత పాలకులు నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాలను తమ ప్రజా ప్రభుత్వంలో పునరుద్ధరించామని, కోటి మంది మహిళలను కోటీశ్వరు లు చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి రూ.20 వేల కోట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నాని తెలిపారు. 5 సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

అధిక లాభాన్నిచ్చే పామాయిల్ పంట పెద్దపెల్లి జిల్లాలో విస్తారంగా పండించాలని మంత్రి సూచించారు. పెద్దపల్లిలో తిరుమా లయ కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుందని తెలిపారు. రాబోయే నెల రోజుల్లో సిద్దిపేటలో పెద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

పెద్దపల్లిలో వీహబ్: మంత్రి శ్రీధర్‌బాబు

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పెద్దపల్లిలో వీహబ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో మహిళల జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబేరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా మన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు దాదాపు రూ.26 వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశామని వెల్లడించారు.

లింకేజీ రుణాలు అందించ డంతో పాటు లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలను అమలు చేస్తున్నామని, మహిళల ఆదాయం పెంచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పాడి పశువుల పెంపకం కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మంథని, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో మహిళా సంఘాల ద్వారా మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళల ద్వారా రైతులు పండించిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేశామని పేర్కొన్నారు. 

అందుకున్న విజయం అందరికి:మంత్రి సీతక్క

అందుకున్న విజయం అందరికీ పంచుదామనే నినాదంతో మహిళా సంఘాలలో నూతన సభ్యులను చేర్చాలని మంత్రి సీతక్క అన్నారు. 60 సంవత్సరాల దాటిన వారు ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దివ్యాంగ సంఘం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాలకు అందించిన రుణాలు 99 శాతం తిరిగి చెల్లిస్తున్నామని, బ్యాంకులు నేడు మహిళా సంఘాలకు క్యూ కట్టి రుణాలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు.

గత ఏడాది కంటే 2024 సంవత్సరంలో రూ.6 వేల కోట్లు అధికంగా రుణాలు తీసుకున్నామని తెలిపారు. ఆర్టీసీకి అద్దె బస్సుల ద్వారా నెలకు రూ.75 వేల ఇస్తున్నామని, మహి ళా సంఘాలు వారికి అందే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా అందిస్తున్నామని, సాధారణంగా మరణిస్తే రూ.2 లక్షల వరకు అమలు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్లు పి.వేణు, జే అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.