08-07-2025 12:00:00 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కామారెడ్డి, జూలై 7 (విజయక్రాంతి): సీనియర్ జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి కుటుం బానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ, ఆదుకుంటామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మధ్యల చెరువు గ్రామంలో దత్తురెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మర ణించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దత్తురెడ్డి భార్య, తల్లిని మంత్రి ఓదార్చారు. దత్తురెడ్డి భార్య ప్రియాంకకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఇద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చా రు.
ఈ సందర్భంగా రూ.4 లక్షల ఆర్థిక సహా యం అందించారు. జర్నలిస్టు దత్తురెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంత రావు, సంజీవ్‌రెడ్డి, నల్లగొండ సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు.