calender_icon.png 3 August, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అండగా ఉంటాం

03-08-2025 12:42:28 AM

  1. 9.70 కోట్ల మందికి 20వ విడత ద్వారా రూ.20,500 కోట్ల జమ
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

యాచారం, ఆగస్టు 2: రైతులకు అండగా ఉంటామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి డిజిటల్ తెరపై తిలకించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత ద్వారా రూ. 20,500 కోట్లు 9.70 కోట్ల మంది అన్నదాతలకు నేరుగా వారి ఖాతాలకు బదిలీ అవుతున్నాయని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.1,300 నుంచి రూ.2,380 లకు పెంచి కేంద్రం కొంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలో ఏటా గతంలో 2,300 కోట్లతో ధాన్యం కొనుగోలు చేసేవారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక రూ.26 వేల కోట్లతో ధాన్యం మీద ఖర్చు చేస్తుందన్నారు. ప్రపంచంలో భారతదేశం త్వరలోనే నాలుగో స్థానం నుంచి మొదటి స్థానానికి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఐసర్ క్రీడ అతరి జోన్ డైరెక్టర్ డాక్టర్ వికె సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషారాణి, సహాయ వ్యవసాయ సంచాలకులు సుజాత, ఆర్డిఓ అనంతరెడ్డి పాల్గొన్నారు.