calender_icon.png 3 May, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుమళ్ల శ్రీనివాస్ వ్యవహారంపై చర్యలు తీసుకుంటాం

03-05-2025 01:25:40 AM

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ 

కరీంనగర్, మే2 (విజయక్రాంతి): గత నెల 28వ తేదీన కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమళ్ల శ్రీనివాస్ పరోక్షంగా దూషణలకు దిగిన అంశంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతల నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చారు.

పార్టీ పరువు తీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, బీజేపీ, బీఆర్‌ఎస్‌తో లోపాయికార ఒప్పందం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌పై దూషణలకు దిగుతూ, పార్టీ పరువు తీస్తున్న పురుమళ్లను శ్రీనివాస్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు నేతృత్వంలో కరీంనగర్ జిల్లాకు 200 మంది కాంగ్రెస్ ముఖ్యనేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్‌ను వెంటనే బహిష్కరించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని విన్నవించారు.