04-07-2025 01:04:29 AM
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెదిరే వేణుగోపాల్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, జూలై 03:బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెదిరే వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా తన నియామకానికి సహకరించినందుకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులను ఆశ్రయించే బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు కృషి చేస్తాని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ పదవి తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. అనంతరం ఎమ్మె ల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు తదితరులుపాల్గొన్నారు.