04-07-2025 01:04:29 AM
బాన్సువాడ జూలై 3 (విజయ క్రాంతి): బాన్సువాడ మండలంలో దేశాయిపేట్ గ్రామంలో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారం వివాదాస్పదమైంది. దేశాయిపేటలో ఆరుగురు లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లను రెవెన్యూ అధికారులు హఠాత్తుగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ గోడు వినకుండా ఇళ్లకు తాళాలు వేయడం అన్యాయమని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.