22-10-2025 07:03:47 PM
మరో మారు అవకాశం ఇవ్వండి..
కర్ర రాజశేఖర్..
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి పని చేశామని మరో మారు అవకాశం ఇవ్వాలని మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ కరీంనగర్, జగిత్యాల బ్రాంచ్, గంగాధర బ్రాంచ్ అర్బన్ బ్యాంకు సభ్యులను కోరారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మా పానల్కు సంబంధించిన 12 మంది డైరెక్టర్లకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బ్యాంకు 1980లో ప్రారంభమైనప్పటి నుండి 2007 వరకు నేను చైర్మన్ గా వచ్చేవరకు 20 కోట్ల డిపాజిట్లు బ్యాంకులో ఉండెనని నేను చైర్మన్ గా వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు అంటే 2007 నుండి 2017 వరకు దాదాపు 60 కోట్ల డిపాజిట్లు సేకరించడం జరిగిందన్నారు.
2017 తరువాత ఇప్పటివరకు 8 సంవత్సరంల ఆరు నెలలు గౌరవ హైకోర్టు ద్వారా ఎన్నికలపై స్టే ఉండడంతో పిఐసీ కమిటీ ఉన్నది వారి ఆధ్వర్యంలో పదికోట్ల డిపాట్లు మాత్రమే రావడం జరిగిందన్నారు. నేను చైర్మన్ గా ఉన్న పది సంవత్సరాలలో బ్యాంకును ఆధునికరించి కంప్యూటర్ ఐజేషన్ చేసి ఆన్లైన్ సౌకర్యం కల్పించి బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరొక అవకాశం ఇవ్వాలని కోరారు.