22-10-2025 08:31:59 PM
మంథని (విజయక్రాంతి): ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్-2025 లో పాల్గొనడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)కు ఘన స్వాగతం లభించింది. మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ మోహన్ యేలిశెట్టి, అఖిల్ రెడ్డి పెండ్రి, మేడగొని హరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు, తెలుగు సంఘ ప్రతినిధులు ఆత్మీయంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం బయోటెక్ రంగంలో సాధిస్తున్న అభివృద్ధి పట్ల మంత్రి శ్రీధర్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.