calender_icon.png 31 October, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతగా హెల్మెట్ ధరించాలి

31-10-2025 01:24:59 AM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని ఎస్పి కాంతిలాల్ పాటిల్ అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో చాలావరకు హెల్మెట్ ధరించకపోవడం ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు.

మన ప్రాణాలను రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు.ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురుచూస్తారన్న ఆలోచన ఎల్లప్పుడూ మదిలో ఉండాలని పేర్కొ న్నారు. పోలీసులు సమాజ భద్రత కోసం విధులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని వారి త్యాగస్పూర్తిని పోలీసులలో ధైర్యాన్ని పెంపొందిస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎఎస్పి చిత్తారంజన్,ఆర్‌ఐ పెద్దన్న, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.