31-10-2025 01:26:22 AM
 
							సమీప గ్రామాల్లో ఆందోళన
బోథ్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్దపులి సంచా రం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా జిల్లా అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్న భీంపూర్ మండలం అటవీ ప్రాం తంలో పెద్దపులి సంచరించిన ఘటన మరవకముందే, తాజాగా బోథ్ అటవీ రేంజ్ పరి ధిలో పెద్దపులి సంచరిస్తోందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఎఫ్‌ఆర్‌ఓ ప్రణ య్ సూచించారు.
గురువారం మండలంలోని చింతలబోరి అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలపై అధికారులతో కలిసి పరిశీలించారు. దింతో ఈ ప్రాంతంలో పెద్ద పులి అడుగులను గుర్తించి,పూలు తిరుగుతుందని నిర్ధారించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు, గొర్ల, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. పనుల నిమిత్తం అడవిలోకి వెళ్లేవాళ్లు వెనుక ముందు బెదురు మాస్కులు ధరించాలని సూచించారు. పత్తి ఏరడానికి వెళ్లే కూలీలు గుంపులుగా వెళ్లి గుంపులుగా రావాలని సాయంత్రం తొందరగానే ఇంటికి చేరుకోవాలని సూచించారు.