31-10-2025 05:07:12 PM
 
							ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన ఫోటోగ్రాఫర్ అట్టేం మధుకర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలు కాగా స్థానిక ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ సంక్షేమ సంఘం సభ్యులు అతనికి ఆర్థికంగా చేయూతనిచ్చారు. మధుకర్ ఇటీవల ఒక షూట్ కు వెళ్లి తిరిగి వస్తుండగా తన ద్విచక్ర వాహనానికి కోతి అడ్డుగా రావడంతో ప్రమాదానికి గురై పడిపోవడంతో గాయాల పాలయ్యాడు. దీంతో నిర్మల్ జిల్లా యూనిట్ సభ్యులు బాధితున్ని పరామర్శించారు. శుక్రవారం అతని స్వగ్రామమైన మాసాయిపేట్ గ్రామంలో ఉన్న తన ఇంటికి వెళ్లి మిత్రబృందం రూ. 5000 నగదు ఆర్థిక సహాయం చేశారు.