calender_icon.png 1 November, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

31-10-2025 05:15:14 PM

తూప్రాన్,(విజయక్రాంతి): భారతదేశ సమగ్ర ఐక్యత కొరకు నాటి రోజుల్లో బ్రిటిష్ వారితో అహర్నిశలు పోరాడుతూ భారతదేశ బానిస సంకెళ్ల నుండి విముక్తి చేయటకు తనదైన శైలిలో ప్రత్యేక ముద్రను వేసుకున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన 1875, అక్టోబర్ 31 గుజరాత్ లోని నడియార్ లో జన్మించారు. చిన్ననాటి నుండి వ్యవసాయ పనులో చురుకుగా పాల్గొని మంచి గుర్తింపు పొందారు. దేశ సంస్థానాలను ఏకీకృతం చేయడంలో వీరు చేసిన పోరాట పటిమకు నాటి ప్రభుత్వం ఉక్కు మనిషిగా గుర్తించి కీర్తించింది.

మహాత్మ గాంధీజీతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు మరియు భారతదేశ జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో భారత దేశ ఉప ప్రధానిగా, తాత్కాలిక కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రిగా దేశ ప్రజలకు సేవలు అందించారు. ఇందులో భాగంగా శనివారం తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సాంఘిక సంఘ సేవకుడు కొలిచెలిమే లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.