31-10-2025 04:51:58 PM
 
							కరీంనగర్,(విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించారు. సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డిసిసి బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మడుపు మోహన్ హాజరై ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశ అభివృద్ధి కోసం కూడు, నీడ, గుడ్డ ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మించాలని చిత్తశుద్ధితో ఆనాడే ఇండ్లు కట్టి ఇవ్వడం జరిగిందన్నారు. ఈనాడు కూడా ఇందిరమ్మ ఇంటిపేరుతో కాంగ్రెస్ పార్టీ ఇళ్లను నిర్మిస్తుందని, ఉక్కు మహిళ అయినా ఇందిరాగాంధీని కొన్ని తీవ్రవాద దుష్టశక్తులు కాల్చి చంపడం జరిగిందని, వారి ఆశయ సాధన కోసం పాటుపడతామని అన్నారు.