31-10-2025 04:55:29 PM
 
							ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వేగంగా జరగాలని ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని దిలావర్పూర్ ,పాతెల్లాపూర్, గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణంలో అలసత్వం వహించరాదని ఎప్పటికప్పుడు నిధులు ప్రభుత్వం అందజేస్తుందని పనులు తాత్సారం చేయరాదని ఆయన సూచించారు. ఆయనతోపాటు ఎంపీవో సిహెచ్ రత్నాకర్ రావు ,సెక్రటరీ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు.