31-10-2025 04:45:54 PM
 
							సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్
సుల్తానాబాద్ లో 2కె రన్ నిర్వహించిన పోలీసులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారతదేశ ఐక్యతకు ప్రతీక ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ ఏకతా దివాస్ లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 2 కే రన్ నిర్వహించారు.
సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి రాజీవ్ రహదారి మీదుగా సెంటిమెరిస్ స్కూల్ వరకు అక్కడి నుండి తిరిగి పూసల చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్సై అశోక్ రెడ్డి, పెద్ద ఎత్తున పోలీసులు, వాకర్స్, క్రీడాకారులు, విద్యార్థులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.