calender_icon.png 1 November, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకమత్యం చాటేందుకే ఏక్తా దివాస్

31-10-2025 05:03:57 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కుల, మత వర్గ, లింగ విభేదాలు లేకుండా ప్రజల్లో ఐకమత్యాన్ని చాటేందుకే ఏక్తా దివాస్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు మండలంలోని వివిధ శాఖల అధికారులు అన్నారు. మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో స్థానిక పోలీసుల శాఖ ఆధ్వర్యంలో టూ కే రన్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ... నేటి యువత సర్దార్ పటేల్ చూపిన బాటలో నడిచి దేశ ఐక్యతకు, అభివృద్ధికి, భద్రతకు పాటుపడాలని అన్నారు.