calender_icon.png 27 December, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలధారణ పూర్వజన్మ సుకృతం

27-12-2025 12:00:00 AM

మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి

వనపర్తి టౌన్, డిసెంబర్ 26: మాలధారణ పూర్వ జన్మ సుకృతం అని మండల పూజ నిర్వహించడానికి నాకు అవకాశం దొరకడం అదృష్టం అని  మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి అయ్యప్ప స్వామి దేవాల యంలో మండల పూజ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో దేదీప్యమానంగా నిర్వహించబడ్డాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మండల పూజ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.18వ పడి నారికేళ గురుస్వామి వాకిటి శ్రీధర్ ను రావుల ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఆలయంలోని గురు స్వాములను సన్మానించి గురుస్వాములు ఆధ్యాత్మికతను పెంపొందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమములో గురుస్వాములు ముత్తు కృష్ణ, చీర్ల.కృష్ణ సాగర్, పాపిరెడ్డి, అమరవాయి, నరేందర్, బీచ్చుపల్లి యాదవ్, వాకిటి.శ్రీధర్, నందిమల్ల అశోక్, ఆవుల. రమేష్ నాయకులు గట్టు యాదవ్, పి.రమేష్ గౌడ్, లక్ష్మా రెడ్డి, నందిమల్ల.శారద, కర్రీస్వామి, ఉంగ్లం. అలేఖ్య తిరుమల్, ఎద్దుల.సాయి కుమార్,సునీల్ వాల్మీకి, మంద.రాము, నందిమల్ల.రమేష్, బాలు నాయుడు, అమరేందర్ పాల్గొన్నారు.