27-12-2025 12:00:00 AM
రేవల్లి, డిసెంబర్ 26: మండల కేంద్రం నుంచి కేశంపేట మీదుగా వనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం నరకప్రాయంగా మారింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు గజగజ వణికిపోతున్నారు. రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలు మృత్యుపాశాలుగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉన్నత అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.