05-12-2025 11:54:23 PM
అడ్డాకుల: మండలం గ్రామ స్వసంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నవీన్ చారి శుక్రవారం నామినేషన్ దాఖలను గ్రామ పెద్దలు యువకులు సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి చర్చిలో పాస్టర్ చంద్రశేఖర్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేయించుకుని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహానికి, వివేకనంద విగ్రహానికికు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
నవీన్ చారి నామినేషన్‌కు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో యువకులు, మహిళలు, వృద్ధులు స్వయంగా హాజరై తమ మద్దతును తెలియజేయడం రాజకీయ వర్గాల్లో విశేష చర్చనీయాంశంగా మారింది. .నామినేషన్ గడప నుండి గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. “మా గ్రామానికిదే కావాల్సిన నాయకత్వం” అని మహిళలు, యువత ఏకకంఠంతో ప్రకటించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నవీన్ మాట్లాడుతూ గతంలో సర్పంచిగా పోటీ చేశాను కానీ విజయం దక్కలేదు ఈసారి ప్రజలు అవకాశం ఇస్తే అభివృద్ధి పథంలో నడిపించడం నా ప్రధాన లక్ష్యం. పారదర్శకత, సేవాభావం, గ్రామ గ్రామాభివృద్ధి.. ఈ మూడు అంశాలకే నా రాజకీయాలు పరిమితం” అని నవీన్ స్పష్టంగా చెప్పారు. విద్య, ఆరోగ్యం, నీటి సదుపాయాలు, రోడ్లు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.