20-11-2025 05:08:35 PM
మండలం అధ్యక్షుడు దరాస్ వార్ సాయిలు..
బిచ్కుంద (విజయక్రాంతి): మద్నూర్ మండలంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామాల్లో ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ వార్ సాయిలు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలకు విస్తృతంగా లాభాలు అందుతు న్నాయని,ముఖ్యంగా మద్నూర్ మండలానికి అత్యధిక నిధులు మంజూరు అయ్యాయని, ఈ అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అధిష్ఠానం చెప్పినట్టు ఐకమత్యం పాటిస్తూ,సమన్వయ లోపం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని,ప్రతి గ్రామం ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులు అహర్నిశలు కృషి చేయాలని ఆయన సూచించారు.పార్టీ అభివృద్ధి కోసం అవసరమైతే,గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి, కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని దరాస్ వార్ సాయిలు హామీ ఇచ్చారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు అభివృద్ధి పరంగా తొంభై శాతం శ్రమ పెట్టి, మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు హనుమాన్ మందిర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్,సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ హన్మంత్ యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.